హాలహర్వి ఎస్సై సస్పెన్షన్‌

హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి పోలీసు స్టేషన్ ఎస్సై కృష్ణమూర్తిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే సస్పెండ్ చేశారని ఆలూరు సి.ఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను వేధింపులకు గురిచేయడం, ఇసుక అక్రమ రవాణాలో ఎస్సై భాగస్వామి కావడంతోనే ఆయన్ను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Back to Top