'సీఎం కిరణ్ను కాంగ్రెస్ అధిష్టానం కట్టడిచేయాలి' | gunda mallesh seeks action against Kiran Kumar Reddy for speaking against Telangana | Sakshi
Sakshi News home page

'సీఎం కిరణ్ను కాంగ్రెస్ అధిష్టానం కట్టడిచేయాలి'

Dec 7 2013 2:22 PM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న దశలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న దశలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్‌ వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ప్రజాఉద్యమమే పునాది అని ఆయన అభివర్ణించారు.

 

ప్రజాఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని సూచించారు. సీఎం కిరణ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని గుండా మల్లేష్ ఈ సందర్బంగా ఆరోపించారు. సీఎం కిరణ్ను కట్టడి చేయాలని ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement