తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం | gun misfire in kurnool district | Sakshi
Sakshi News home page

తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం

May 19 2016 2:36 PM | Updated on Aug 21 2018 3:16 PM

తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం - Sakshi

తుపాకీ మిస్‌ఫైర్: గన్‌మెన్‌కు గాయం

తుపాకీ జారి కిందపడి పేలిన ఘటనలో గన్‌మెన్ గాయపడ్డాడు.

నంద్యాల క్రైం: తుపాకీ జారి కిందపడి పేలిన ఘటనలో గన్‌మెన్ గాయపడ్డాడు.  ఈ ఘటన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పెద్దబోదనం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచి మహేశ్వర్‌రెడ్డిపై మూడు హత్య కేసులున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో టీడీపీ నాయకుడిగా ఉన్న ఇతనికి ప్రభుత్వం గన్‌మన్ రక్షణ కల్పించింది.

అలాగే మహేశ్వర్‌రెడ్డికి ఓ లెసైన్స్‌డ్ తుపాకీ కూడా ఉంది. అయితే ఆ తుపాకీ కూడా మహేశ్వర్‌రెడ్డి తన గన్‌మన్ సుబ్రహ్మణ్యం వద్ద ఉంచాడు. లోడ్ చేసి ఉన్న సదరు తుపాకీ గురువారం ఉదయం సుబ్రమణ్యం చేతిలో నుంచి కిందకి జారి పడి పేలింది. బుల్లెట్ సుబ్రమణ్యం కాలిలోకి దూసుకెళ్లి గాయమైంది. క్షతగాత్రుడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement