ఏపీలోని తెనాలిలో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ పర్యవేక్షణ...
తెనాలి: ఏపీలోని తెనాలిలో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ పర్యవేక్షణలో 1,28,918 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఎక్కారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి ఫార్ట్యూనా గిన్నిస్ బుక్ సర్టిఫికెట్‌ను స్వామిజీకి తమిళనాడు గవర్నర్ రోశయ్య సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో నన్నపనేని, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. - తెనాలి