breaking news
Shri Ganapati saccidanandasvamiji
-
లక్షల మంది హృదయాల్లో భగవద్గీత జ్ఞానాన్ని నింపిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
వాషింగ్టన్: గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. పరపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా వున్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు శ్రీ స్వామీజీ.అలా పూజ్య స్వామీజీ చూపిన మార్గంలో భగవద్గీతను కంఠస్థం చేసి ఎందరో తమ జీవితాల్లో మార్పును చూస్తున్నారు. మన సనాతన ధర్మం ద్వారా సమసమాజ నిర్మాణానికి అహర్నిశం శ్రమిస్తూ ఆధ్యాత్మికతను సుస్థిరం చేస్తున్న మహనీయులు, అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు శ్రీ స్వామీజీ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా పది వేలమంది భక్తులతో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఫ్రీస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను పఠించారు. -
గిన్నిస్‌బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణం
తెనాలి: ఏపీలోని తెనాలిలో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ పర్యవేక్షణలో 1,28,918 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఎక్కారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి ఫార్ట్యూనా గిన్నిస్ బుక్ సర్టిఫికెట్‌ను స్వామిజీకి తమిళనాడు గవర్నర్ రోశయ్య సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో నన్నపనేని, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. - తెనాలి