అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం | Growths in the fire burning | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం

Dec 24 2013 12:49 AM | Updated on Sep 2 2017 1:53 AM

ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవ దహనమైన ఘటన బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

హనుమాన్ జంక్షన్ రూరల్, న్యూస్‌లైన్ :  ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ వృద్ధుడు  సజీవ దహనమైన ఘటన  బాపులపాడు మండలం  కానుమోలు గ్రామంలో ఆదివారం రాత్రి  చోటుచేసుకుంది.   తలుపుల రామకోటయ్య (85) పాఠశాలలో వాచ్‌మెన్‌గా చేసి  రిటైరయ్యారు.  

కుటుంబ సభ్యులుండే ఇంటికి సమీపంలో రేకుల షెడ్డు గదిలో ఒంటరిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చుట్ట వెలిగించుకోబోతుండగా,  ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపైన పడి, దుప్పటికి, మంచానికి ఉన్న ప్లాస్టిక్ వైరుకు మంటలు అంటుకున్నాయి.   

కదలలేని స్థితిలో ఉన్న కోటయ్య మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోగానే అగ్నికి ఆహుతైపోయాడు. హనుమాన్ జంక్షన్ సీఐ వైవీ రమణ, ట్రైనీ డీఎస్పీ అనిల్‌కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర ్వహించారు.  మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement