breaking news
ramakotayya
-
నిద్రిస్తుండగా వచ్చి.. గొంతు కోసి..
* నిందితుల పరార్ * ఎవరు, ఎందుకు చేశారో అంతుబట్టని వైనం రుద్రవరం (అచ్చంపేట): ఇంటిముందు మంచంపై నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేసి కత్తితో గొంతు కోసి పరారైన సంఘటన మండలంలోని రుద్రవరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 75 సంవత్సరాల గడ్డం రామకోటయ్య తన ఇంటి ముందు మంచం వేసుకుని నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి దోమతెరను పైకి లేపి కత్తి చూపించాడని, లేవబోయే సమయంలో గొంతు కోసి పరారయ్యాడని చెప్పారు. తనకు శతృవులు ఎవరూ లేరని, గ్రామంలో అందరూ తనతో బాగానే ఉంటారని, ఆస్తి తగాదాలు ఏమీ లేవని చెప్పాడు. వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశాడనేది తెలియవలసి ఉంది. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ గుడి రాజేశ్వరరావు సందర్శించి కేసు నమోదు చేసి చుట్టు ప్రక్కల వారిని విచారించారు. బాధితుడిని గుంటూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కాగా, గతంలో క్రోసూరు మండలం గుడిపాడులో కూడా ఇదే విధంగా కొందరు వ్యక్తులు వృద్ధ దంపతులపై దాడి చేసి హతమార్చారు. అప్పట్లో సైకో ఈ పని చేశాడని అందరూ చెప్పుకున్నారు. ఇంతవరకు హంతకులు ఎవరన్నది పోలీసులకు కూడా అంతు బట్టలేదు. అదే తరహాలోనే రామకోటయ్యపై కూడా దాడి జరిగింది. బాధితునికి నలుగురు సంతానం, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. మగపిల్లలలో పెద్దబ్బాయి వేల్పూరులో మీసేవా కేంద్రాన్ని నడుపుతున్నాడు. భార్యలేదు. -
అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం
హనుమాన్ జంక్షన్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవ దహనమైన ఘటన బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తలుపుల రామకోటయ్య (85) పాఠశాలలో వాచ్‌మెన్‌గా చేసి రిటైరయ్యారు. కుటుంబ సభ్యులుండే ఇంటికి సమీపంలో రేకుల షెడ్డు గదిలో ఒంటరిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చుట్ట వెలిగించుకోబోతుండగా, ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపైన పడి, దుప్పటికి, మంచానికి ఉన్న ప్లాస్టిక్ వైరుకు మంటలు అంటుకున్నాయి. కదలలేని స్థితిలో ఉన్న కోటయ్య మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోగానే అగ్నికి ఆహుతైపోయాడు. హనుమాన్ జంక్షన్ సీఐ వైవీ రమణ, ట్రైనీ డీఎస్పీ అనిల్‌కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర ్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.