ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ  | Grama Panchayat System From October 2 | Sakshi
Sakshi News home page

ఇక స్థానిక ప్రభుత్వాలు

Jul 21 2019 7:50 AM | Updated on Jul 21 2019 7:50 AM

Grama Panchayat System From October 2 - Sakshi

సాక్షి, ఒంగోలు టూటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు సచివాలయాలుగా రూపాం తరం చెందనున్నాయి. 70 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ కన్న కలలు నేడు సాకారం కాబోతున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్న బాపూజీ ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నెరవేరబోతోంది. పంచాయతీలకే అధికారాలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం నేడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకోని పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను పంచాయతీలే నిర్వహించుకునేలా గ్రామ సచివాలయ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తరుŠువ్ల జారీ చేశారు. పనిలో పనిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన విధి, విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సచివాలయంలోనే పాలన... 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994 లో పార్లమెంట్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్న 13 శాఖలకు చెందిన 29 రకాల అధికారాలను స్థానిక పంచాయతీలకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంతోపాటు 2007లోనే ఉత్తరుŠువ్ల కూడా జారీ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా స్థానిక పాలనను అమలు చేసిన దాఖలాలు లేవు. స్థానిక పాలనను అమలు చేయాలని కోరుతూ అప్పట్లో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పలు పోరాటాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 

పరిపాలనలో నూతన ఒరవడితోపాటు పేదల ఇంటివద్దకే సేవలు అనే నినాదంతో తొలి అడుగులేసిన సీఎం వెంటనే  గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించి ప్రజల వద్దకే సత్వర సేవలు అనే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ గ్రామ వలంటీర్లకు మొత్తం 56, 809 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించన్నారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఎంపిక జాబితా కూడా పూర్తయ్యాయి. 

రెవెన్యూ గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు...  
జిల్లాలో 56 మండలాలు ఉండగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లుగా పరిపాలన సాగుతోంది. వీటి పరిధిలో 1038 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేజర్‌ పంచాయతీలు, మైనర్‌ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద  33 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలంటే జనాభా సంఖ్య ఆధారంగా చేయాల్సి ఉంది.  రెండు వేలు జనాభా నుంచి నాలుగు వేల జనాభా మధ్య ఉండే గ్రామపంచాయతీలో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు.  వెయ్యి, పదిహేను వందలు, ఐదొందలు జనాభా కలిగిన గ్రామపంచాయతీలను ఒకటిగా చేసి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల కంటే తక్కువ జనాభా ఉన్నా ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. పైగా రెవెన్యూ గ్రామంలోనే వీలున్నంత వరకు గ్రామ సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అలా జిల్లాలో 732 గ్రామ సచివాలయాలను గుర్తించారు. అయితే ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలను 912 గ్రామ సచివాలయాలకు ఎందుకు పెంచకూడదు అంటూ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తరుŠువ్ల జారీ చేసింది. రెవెన్యూ విలేజ్‌కి గ్రామ పంచాయతీకి అనుసంధానం చేస్తూ గ్రామ సచివాలయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ శారద ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు పూర్తి చేసి  రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ అటు వైపు కసరత్తు మొదలెట్టారు.  దీంతో మళ్లీ జిల్లాలో గ్రామ సచివాలయాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. 

గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకం: 
గ్రామ వాలంటీర్ల నియామకమే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయంలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. డిగ్రీ అర్హతగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం 91,652 ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యం.  ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా, వ్యయ ప్రయాసలు పడకుండా గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలను తీర్చేందుకు సీఎం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. అక్టోబర్‌ 2 నుంచి ఈ విధానం రాష్ట్రమంతటా ఒకే సారి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సచివాలయ కన్వీనర్‌గా సెక్రటరీ: 
గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. జీతాల చెల్లింపు కూడా కార్యదర్శి ద్వారానే నిర్వహిస్తారు. అయితే కార్యదర్శితో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ సెలవుల మంజూరు చేసే అధికారం సర్పంచ్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement