జిల్లాలో భర్తీ చేయనున్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు అడకత్తెరలో పోక చెక్కలాగా మారాయి.
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో భర్తీ చేయనున్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు అడకత్తెరలో పోక చెక్కలాగా మారాయి. కార్యదర్శి పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందోనని ఎదురు చూసిన నిరుద్యోగులు ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టు ఎప్పుడు తీర్పు ఇస్తుందా..? అని ఎదు రు చూస్తున్నారు. జిల్లాలో 29 గ్రామ కార్యద ర్శి పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు నవంబర్ 6న దరఖాస్తుల కు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
వారం రోజు ల పాటు దరఖాస్తులు స్వీకరించగా అన్ని కెట గిరీలకు కలుపుకుని మొత్తం 5,500 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే మరో రెండు రోజుల్లో భర్తీ పక్రియ పూర్తయ్యే సమయంలో ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు ఈ ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని, తమను రెగ్యూలరైజ్ చేసే వరకు పో స్టుల భర్తీ చేపట్ట వద్దని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే డిసెం బర్ 13న కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉండగా వా యిదా పడింది. ఇటు కోర్టు ఇచ్చిన నోటిసు ప్రకారం జిల్లా పంచాయతీ అధికారులు కౌం టర్ ఫైలును దాఖలు చేశారు. అయితే పలు కారణాల వల్ల కోర్టు ఇప్పటికే మూడు సార్లు కేసును వాయిదా వేసింది. దీంతో ఈ ఉద్యోగా ల కోసం పోటీ పడి దరఖాస్తులు చేసుకున్న వేల మంది కోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు డీపీఓ కార్యాలయానికి వస్తు అధికారులను అడిగి తెలుసుకుంటున్నా రు. మరి కొందరైతే ఈ ఉద్యోగాలపై ఆశలు వదులుకుని, ఇతర ఉద్యోగాలను వెతుక్కుం టున్నారు.వీఆర్‌ఓ,వీఆర్‌ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో ఆందరి చూపు వాటి వైపు మళ్లింది. కార్యదర్శి పోస్టుల భర్తీ కోర్టుకెక్కడం తో జోరుగా పైరవీలు కొనసాగించిన వారికి చుక్కెదురైనట్లయింది. కొంత అడ్వాన్స్ తీసుకున్న పైరవీ కారులపై డబ్బు తిరిగి ఇవ్వాలని అభ్యర్థులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.