పంచాయతీలకు ఊరట | Govt releases funds to renovate panchayat offices | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ఊరట

Oct 10 2014 1:05 AM | Updated on Sep 2 2017 2:35 PM

గతంలో పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రెండేళ్లపాటు నిలిచిపోయిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడతల వారీగా విడుదల అవుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి

 ఏలూరు : గతంలో పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రెండేళ్లపాటు నిలిచిపోయిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడతల వారీగా విడుదల అవుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 931 గ్రామ పంచాయతీలకు రెండో విడతగా రూ.15.90 కోట్ల నిధులు విడుదల య్యాయి. ఈ నిధులను పనితీరు ఆధారంగా గ్రామ పంచాయతీలకు కేటారుుం చారు. ఆ మొత్తాలు నాలుగైదు రోజుల్లో ట్రెజరీ ద్వారా పంచాయతీ ఖాతాలకు జమ కానున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంత పెద్దమొత్తంలో నిధులు విడుదల కావడం ఇది రెండోసారి. మూడు నెలల క్రితం రూ.19 కోట్లు పంచాయతీలకు అందాయి. తాజాగా రూ.15.90 కోట్లు విడుదల అయ్యూరుు. నిధులను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని డీపీవో అల్లూరి నాగరాజువర్మ తెలిపారు. ఈ నిధులను ఏయే పనులకు ఖర్చు చేయూలనే విషయమై ఆగస్టు 13న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులోని మార్గదర్శకాలను అనుసరించి సమగ్ర  రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యుఎస్), పబ్లిక్ వాటర్ స్కీమ్‌లు (పీడబ్ల్యుఎస్), పారిశుధ్యం నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు, ఇ-పంచాయతీల నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పారిశుధ్య పనులకు నిధులను వినియోగించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement