సీపీఎస్‌ రద్దు కోరుతూ భారీ ర్యాలీ

Govt Employees Protest For Canceled CPS System - Sakshi

సాక్షి, అనంతపురం: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేఖంగా నల్లదుస్తులతో అనంతపురంలో భారీ  ర్యాలీ చేపట్టారు. ఏపీ సీపీఎస్‌ ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ... సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగలకు పదవి విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయని అనుకున్నాం కానీ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దుపై విషయంలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినందుకు వారు వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top