గోదావరి పుష్కరాలకు వెళుతున్న భక్తుల నుంచి టోల్ ప్లాజాల వద్ద రుసం వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్ర స్థాయిలో
ఎచ్చెర్ల : గోదావరి పుష్కరాలకు వెళుతున్న భక్తుల నుంచి టోల్ ప్లాజాల వద్ద రుసం వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. పక్క జిల్లాల్లో అమలవుతున్నా శ్రీకాకుళం జిల్లాలో అమలు కాకపోవటంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. చికలకపాలెం టోల్ ప్లాజాలో ఈ నెల 19 తేదీన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో రాత్రి కొంతసేపు పోలీస్ అధికారలు ఆదేశాలతో టోల్ రుసం తీసుకోలేదు. ఇది కూడా కొన్ని గంటలే అమలైంది. ఇక్కడి యాజమాన్యం మాత్రం వసూలును పక్కాగా చేయాలని సిబ్బందికి ఆదేశించినట్టు తెలిసింది. రోడ్డు రెండు వైపులా సైతం వాహనాలు నిలుపు చేసేలా బండరాళ్లు, ముళ్ల కంపలు పెట్టి మరీ టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులు కచ్చితమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని కొందరంటున్నారు.