
'ఇద్దరు సీఎంలు సినిమా చూపిస్తున్నారు'
సెక్షన్ 8 పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని సీపీఐ సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు.
కాకినాడ: సెక్షన్ 8 పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని సీపీఐ సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర పుష్కరాలకు నిధులున్నాయి కానీ..పేదలకు మాత్రం నిధులు లేవని మంగళవారం కాకినాడలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలను వ్యాపారంగా మర్చారని నారాయణ ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థతో డబ్బు ఖర్చు తప్ప పెద్దగా ఒరిగేదేమీలేదన్నారు.