572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని | GO issued for 572 doctor posts: Kamineni srinivas | Sakshi
Sakshi News home page

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

Apr 10 2015 11:49 PM | Updated on Sep 3 2017 12:07 AM

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

రాష్ట్రంలో 572 వైద్యుల పోస్టులను భర్తీకి సంబంధించి శుక్రవారం జీవో జారీ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

కొవ్వూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో 572 వైద్యుల పోస్టులను భర్తీకి సంబంధించి శుక్రవారం జీవో జారీ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 572 పోస్టుల భర్తీతో వైద్యుల కొరత చాలావరకు తీరిపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకంలో ఇప్పటివరకు ఉన్న 930 వ్యాధులకు అదనంగా మరో వంద రకాల వ్యాధులను చేర్చినట్టు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement