రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతి శాఖలో మంజూరు పోస్టులెన్ని, ఎన్ని ఖాళీలున్నాయి, డిప్యుటేషన్‌పై ఏ శాఖలో ఎంతమంది ఉన్నారనే వివరాలను పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సోమవారం అన్ని శాఖలకు మెమో జారీ చేసింది.
- అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో
- రెండు రాష్ట్రాలు ఏర్పడగానే డిప్యుటేషన్లు రద్దు
- ఏప్రిల్ 1వ తేదీ కల్లా ఉద్యోగుల పంపిణీపై కేంద్ర సలహా కమిటీ
- విభజన కారణంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగి అరుునా అతని సర్వీసు, సీనియారిటీ, హోదాకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
- కమల్‌నాథన్ కమిటీ ఏప్రిల్ 1లోగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాల రూపకల్పన పూర్తి చేస్తుంది.
- ఏప్రిల్ 1 కల్లా ఉద్యోగుల పంపిణీకోసం కేంద్రం చట్టబద్ధమైన సలహా కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమలనాథన్ కమిటీ మార్గదర్శక సూత్రాలకనుగుణంగా సలహా కమిటీ ఆప్షన్ల ఆధారంగా సీమాంధ్ర, తెలంగాణకు ఉద్యోగుల పంపిణీ జరుగుతుంది.
- ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి వెళ్లాలో నిర్ధారిస్తూ సలహా కమిటీ తొలుత తాత్కాలిక జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలున్నా ఉద్యోగులు సలహా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అభ్యంతరాలను పరిష్కరించాక ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉద్యోగులు, వారి పేర్లతో సహా తుది జాబితాను సలహా కమిటీ ప్రకటిస్తుంది. ఆ తరువాత కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సలహా కమిటీ దృష్టికి తీసుకువెళ్లవచ్చు.