గిరిసిగలో మణిహారం | Girisigalo Manihara | Sakshi
Sakshi News home page

గిరిసిగలో మణిహారం

Nov 5 2014 1:57 AM | Updated on Sep 2 2017 3:51 PM

వెంకటగిరిటౌన్: వెంకటగిరి సంస్థానాధీశుల పాలన, చేనేతల నైపుణ్యంతో వెంకటగిరి చీర అంతర్జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో వెంకటగిరిది ప్రత్యేక స్థానం.

 వెంకటగిరిటౌన్: వెంకటగిరి సంస్థానాధీశుల పాలన, చేనేతల నైపుణ్యంతో వెంకటగిరి చీర అంతర్జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో వెంకటగిరిది ప్రత్యేక స్థానం. వెంకటగిరి-తిరుపతి మార్గంలో పట్టణ శివారులో పది ఎకరాల సువిశాల ప్రశాంత వాతావరణంలో ఏర్పాటైన తారకరామా క్రీడాప్రాంగణంలో అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు క్రికెట్ పిచ్‌లు రూపుదిద్దుకున్నాయి.

వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. 90వ దశకంలో ఏర్పాటై ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడాప్రాంగణం అభివృద్ధిలో వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం.  శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌పోటీ ల్లో ఇండియా టీంకు మేనేజర్‌గా ఓ పర్యాయం బాధ్యతలు నిర్వహించిన  వెలుగోటి సత్యప్రసాద్ యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి క్రికెట్‌క్లబ్ అధ్యక్షుడిగా, సౌత్‌జోన్‌జట్టు పర్యవేక్షుడిగా వ్యవహరిస్తున్నారు. స్టేడియం అభివృద్ధిలో ఆయన కృషి చేశారు.

ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.60 లక్షల నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు పిచ్‌లను తయారు చేశారు. ఆరునెలలుగా జరు గుతున్న ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేశారు. పిచ్‌లో సాధారణ స్ప్రింక్లర్లతోపాటు భూమిలోపలి నుంచి నీళ్లు వచ్చేలా స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. మైదానంలో పచ్చిక ఏర్పాటుకే రూ.6 లక్షల వరకూ  ఖర్చుచేసినట్టు స్టేడియం నిర్వాహుకులు తెలి పారు. వచ్చే ఏడాది నుంచి  రాష్ట్రస్థాయి క్రికెట్‌పోటీలకు వేదిక కానుందని నిర్వాహుకులు తెలిపారు.

 ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి రాక నేడు
 కొత్త పిచ్‌లను ప్రారంభించేందుకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు బుధవారం వెంకటగిరి రానున్నారు. ఏసీఏ డెరైక్టర్, అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్‌కే ప్రసాద్ మంగళవారం వెంకటగిరి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement