చదువుల ఒత్తిడితో మరో విద్యాకుసుమం నేల రాలింది. మధురవాడ గాయత్రీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న నాగులాపల్లి ఓంకార్ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశాడు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: చదువుల ఒత్తిడితో మరో విద్యాకుసుమం నేల రాలింది. మధురవాడ గాయత్రీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న నాగులాపల్లి ఓంకార్ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశాడు. మూడు నెలల క్రితం గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం సీఎస్‌సీ గ్రూపులో చేరి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ సబ్జెక్టు తనకు అంతగా అర్థంకావడంలేదని ఎప్పుడూ మథనపడుతూ ఉండేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఉదయం ఓంకార్ తరగతులకు వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయాడు. సహచర విద్యార్థులు లంచ్‌బ్రేక్‌లో హాస్టల్‌కు వెళ్లినప్పుడు అతను ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు.