breaking news
Gayatri Engineering College
-
‘గాయత్రి’ విద్యార్థులకు అవార్డులు
సాగర్‌నగర్, న్యూస్‌లైన్ : గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల (రుషికొండ)కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. హైదరాబాద్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్ అవార్డులు సాధించారు. కళాశాలకు చెందిన యేచూరి మణిదీప్ ఉత్తమ విద్యార్థిగా అవార్డు పొందారు. అతనికి బంగారుపతకం, రూ.10వేల నగదును పురస్కారంగా ప్రకటించగా హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థి తరఫున ఆయన తండ్రి సత్యనారాయణ టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న నుంచి అందుకున్నారు. బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్టు అవార్డును కె.అఖిలానాయుడు, కె.దివ్య, కె.సాహితి మాధురిల బృందం రియల్‌టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్స్ ప్రాజెక్టుకుగాను అందుకున్నారు. ఈ అవార్డు కింద బంగారు పతకం, రూ.20వేల నగదు అందజేశారు. ఈ అవార్డును గీతం ఇంజినీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వెంకటరావు అందుకున్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులను గీతం ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అభినందించింది. -
రాలిన మరో విద్యా కుసుమం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: చదువుల ఒత్తిడితో మరో విద్యాకుసుమం నేల రాలింది. మధురవాడ గాయత్రీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న నాగులాపల్లి ఓంకార్ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశాడు. మూడు నెలల క్రితం గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం సీఎస్సీ గ్రూపులో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. ఈ సబ్జెక్టు తనకు అంతగా అర్థంకావడంలేదని ఎప్పుడూ మథనపడుతూ ఉండేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఉదయం ఓంకార్ తరగతులకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయాడు. సహచర విద్యార్థులు లంచ్‌బ్రేక్‌లో హాస్టల్‌కు వెళ్లినప్పుడు అతను ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు.