కోవిడ్‌ బలహీన పడింది

Gastroenterologist Nageshwar Reddy Comments About Covid-19 Virus - Sakshi

భారత్‌కు వచ్చేసరికి రూపు మార్చుకుంది

ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌ భారత్‌కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. అక్కడ బలపడి యూరప్‌ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్‌ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్‌ చెంది వైరస్‌ బలహీన పడిందని చెప్పారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రొ ఎంటరాలజీ అధినేత డా.డి.నాగేశ్వరరెడ్డి వైరస్‌ గురించి ఓ  ఛానెల్‌తో మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

- వుహాన్‌ నుంచి ఇటలీకి వైరస్‌ చాలా ప్రాథమిక దశలోనే వెళ్లింది
- మొత్తం మూడు మ్యుటేషన్‌లు జరిగినట్టు మనకు పరిశోధనల్లో తేలింది
- ఇటలీకి వెళ్లిన సమయంలో జరిగిన మ్యుటేషన్‌ బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ మ్యుటేషన్లలో 3 అమైన్‌ యాసిడ్స్‌ మారాయి
- మన దేశానికి వచ్చిన వైరస్‌కూ.. వుహాన్‌లో మొదలైన వైరస్‌కు తేడా వుంది.
- మన దేశంలో వచ్చిన వైరస్‌ మ్యుటేషన్‌కూ, ఇటలీ వైరస్‌ మ్యుటేషన్‌కూ తేడా ఉంది. మన దేశంలోకి వచ్చే సరికి సైక్‌ మ్యుటేషన్‌ అంటే కొమ్ములు పెరిగిన వైరస్‌ వచ్చింది
- దీన్ని బట్టి మన దగ్గరున్న వైరస్‌ ఇటలీలో ఉన్న వైరస్‌ కంటే బాగా బలహీన పడింది
- ఈ కొమ్ములు బాగా ఉన్న వైరస్‌ మన శరీరంలోని కణాలతో అల్లుకుపోవడం (ఇంటరాక్షన్‌) చాలా తక్కువగా ఉంటుంది
- ఈ వైరస్‌ వల్ల మనకు జరిగే నష్టం చాలా తక్కువని చెప్పుకోవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top