టీడీపీలో భగ్గుమన్న విభేదాలు | ganta srinivasa rao write to chandrababu against ayyanna patrudu | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Jun 14 2017 1:39 PM | Updated on Aug 10 2018 6:49 PM

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు - Sakshi

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

మంత్రులు చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.

అయన్నపాత్రుడిపై చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు లేఖ
పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారని ఫిర్యాదు


అమరావతి: విశాఖ టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ప్రభుత్వంపై విమర్శలు ఇరుకున్నపెడుతున్న అయ్యన్నపాత్రుడి వైఖరిపై అధినేతకు గంటా ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. అయన్నపాత్రుడి తీరుతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్‌, ల్యాండ్‌ పూలింగ్‌, చంద్రన్న సంక్రాంతి కానుకల పథకాలపై నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటం​లో పెట్టారని వాపోయారు.

ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూకుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం​ సంచలనం రేపిందని గుర్తు చేశారు. అయన్నపాత్రుడి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. అయన్న ఆరోపణలతో విశాఖ ప్రతిష్టతో పాటు యావత్‌ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాద ముందని ఆవేదన చెందారు. విశాఖ భూకుంభకోణంపై సీబీసీఐడీ, సీబీఐ లేదా జట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని గంటా శ్రీనివాసరావు లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement