ఎక్సయిజ్‌పై సీరియస్ | ganta srinivasa rao Serious in eksayij Department | Sakshi
Sakshi News home page

ఎక్సయిజ్‌పై సీరియస్

Jul 10 2014 12:46 AM | Updated on May 3 2018 3:17 PM

ఎక్సయిజ్‌పై సీరియస్ - Sakshi

ఎక్సయిజ్‌పై సీరియస్

ఎక్సయిజ్ శాఖ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని నిల దీశారు.

  •      ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయాలపై మంత్రి గంటా ఆగ్రహం
  •      బెల్ట్‌షాప్ రహిత జిల్లాగా చేయాలని ఆదేశం
  • విశాఖపట్నం: ఎక్సయిజ్ శాఖ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని నిల దీశారు. జిల్లాలో ఎక్సయిజ్ శాఖ పని చేస్తోందా? లేదా? అని ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కలసి జిల్లా ఎక్సయిజ్ శాఖ అధికారులతో బుధవారం ఉదయం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్‌షాప్ వ్యవస్థను రూపుమాపాలన్నారు.

    బెల్ట్‌షాప్ రహిత జిల్లాగా చేయాలన్నారు. వైన్‌షాపులు, బార్‌లు నిర్ణీత వేళలు పాటిస్తున్నాయో లేదో ఎం దుకు పరిశీలించడం లేదని ప్రశ్నించా రు. మరో 15 రోజుల తర్వాత నిర్వహిం చే సమీక్ష లోపు జిల్లాను ఆదర్శంగా ఉంచాలన్నారు. ఎక్సయిజ్ శాఖపైనే రా ష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్ట ఆధారపడి ఉందన్నారు. ఇకపై తాను, ఎమ్మెల్యేలు ఆకస్మిక తనిఖీలు చేపడతామని, తేడా వస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసు శాఖతో కలిసి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని సూచించా రు.

    ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్ద సీసీ కె మెరాలు ఏర్పాటు చేసి ఎవరెవరు మ ద్యం ఎంత మోతాదులో కొంటున్నారో గమనించాలన్నారు. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ సీతమ్మధారలోని గాయత్రి వైన్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆ దుకాణాన్ని రద్దు చేయాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పి.వి.ఎస్.గోవింద మాట్లాడు తూ వైన్ షాపుల్లో గ్లాసులు, వాటర్ ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలన్నారు.

    ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ స త్యనారాయణ మాట్లాడుతూ ఎక్సయిజ్ పాలసీని మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమీక్షలో సహాయ కమిషనర్ టి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రామచంద్రరావు, శ్రీనివాస చౌదరి, డి.శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement