breaking news
Eksayij Department
-
సారా ఏరులు
మూడు పీపాలు, ఆరు క్యాన్లుగా వెలిగిపోతున్న తయారీదారులు కిరాణా దుకాణాలకు సరఫరా గుట్టుగా అమ్మకాలు విశాఖపట్నం: బెల్టు దుకాణాలపై ఎక్సయిజ్ శాఖ దాడులు పెరగడంతో మందుబాబులు సారా బాట పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సారా ప్యాకెట్లను ద్విచక్రవాహనాల్లో తరలిస్తూ విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాలకు సరుకులను సరఫరా చేసినట్టు బ్యాగుల్లో సారా ప్యాకెట్లను నింపి బైకుల పై సంచరిస్తూ విక్రయిస్తున్నారు. చౌకగా లభించడం, తక్కువ మోతాదుకే ఎక్కువ కిక్ ఇస్తుండటంతో పల్లెల్లో దొరికే సారాకు మద్యం ప్రియులు ఎగబడుతున్నా రు. జిల్లాలో ఇప్పటికే 97 మద్యం దుకాణాలకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ఆ వ్యాపారాన్ని సారా ముఠా చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఎక్సయిజ్ శాఖ కళ్లుగప్పి సారా వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు చక్రం తిప్పుతోంది. పెరుగుతున్న సారా కేసులు : జిల్లాలో కొంతకాలంగా సారా కేసులు పెరుగుతున్నాయి. జూలైలో భారీగా కేసులు నమోదు కావడం ఎక్సయిజ్ శాఖకు తలనొప్పిగా పరిణమించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 720 మందిపై సారా కేసులు పెడితే, జూలై ఒకటి నుంచి 23 మధ్య 424 కేసులు నమోదయ్యాయంటే సారా విక్రేతల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతోందో ఊహించుకోవచ్చు. న ర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, పాడేరు, అరుకు, చింతపల్లి, అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో సారా విక్రేతలు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాల్లో సారాను కాచి ప్యాకెట్లలోకి నింపుకుని చెక్‌పోస్టులు లేని మార్గాల్లో కావిళ్లతో గ్రామాల్లోకి రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి చిన్నచిన్న ప్యాకెట్లలోకి సారా పోసి వాటిని కిరాణా వర్తక వ్యాపార సంచుల్లో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా పైపైన చిరుతిళ్లను పెట్టి పల్లెల్లోకి సరఫరా చేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం పల్లెల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు సాగుతున్నా అధికార యంత్రాంగం మౌనవ్రతం చేస్తోంది. గాజువాక పారిశ్రామిక వాడల్లోనూ ఈ వ్యాపారం ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. రాత్రి విధులు ముగించుకుని ఉదయాన్నే ఇంటిబాట పట్టేవారికి, ఇంటి నుంచి రాత్రి విధులకు వెళ్లేవారికి మార్గమధ్యంలోనే ఈ దుకాణాలు ఆహ్వానాలు పలుకుతున్నాయని మందుబాబులు చెప్పుకుంటున్నారు. 252 మందికి రిమాండ్ బెల్ట్ దుకాణాలు నిర్వహించే గ్రామీణులు కొందరు సారా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలిస్తుండటంతో వారంతా ఈ వ్యాపారంలోకి వెళ్లినట్టు తెలిసింది. రెండు మాసాల్లో జిల్లాలోని 246 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేసి 252 మందిని రిమాండ్‌కు తరలించారు. -
ఎక్సయిజ్‌పై సీరియస్
ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయాలపై మంత్రి గంటా ఆగ్రహం బెల్ట్‌షాప్ రహిత జిల్లాగా చేయాలని ఆదేశం విశాఖపట్నం: ఎక్సయిజ్ శాఖ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని నిల దీశారు. జిల్లాలో ఎక్సయిజ్ శాఖ పని చేస్తోందా? లేదా? అని ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కలసి జిల్లా ఎక్సయిజ్ శాఖ అధికారులతో బుధవారం ఉదయం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్‌షాప్ వ్యవస్థను రూపుమాపాలన్నారు. బెల్ట్‌షాప్ రహిత జిల్లాగా చేయాలన్నారు. వైన్‌షాపులు, బార్లు నిర్ణీత వేళలు పాటిస్తున్నాయో లేదో ఎం దుకు పరిశీలించడం లేదని ప్రశ్నించా రు. మరో 15 రోజుల తర్వాత నిర్వహిం చే సమీక్ష లోపు జిల్లాను ఆదర్శంగా ఉంచాలన్నారు. ఎక్సయిజ్ శాఖపైనే రా ష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్ట ఆధారపడి ఉందన్నారు. ఇకపై తాను, ఎమ్మెల్యేలు ఆకస్మిక తనిఖీలు చేపడతామని, తేడా వస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసు శాఖతో కలిసి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని సూచించా రు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్ద సీసీ కె మెరాలు ఏర్పాటు చేసి ఎవరెవరు మ ద్యం ఎంత మోతాదులో కొంటున్నారో గమనించాలన్నారు. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ సీతమ్మధారలోని గాయత్రి వైన్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆ దుకాణాన్ని రద్దు చేయాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పి.వి.ఎస్.గోవింద మాట్లాడు తూ వైన్ షాపుల్లో గ్లాసులు, వాటర్ ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలన్నారు. ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ స త్యనారాయణ మాట్లాడుతూ ఎక్సయిజ్ పాలసీని మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమీక్షలో సహాయ కమిషనర్ టి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రామచంద్రరావు, శ్రీనివాస చౌదరి, డి.శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.