గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ ఆత్మహత్య

Gangster Sunil committed suicide - Sakshi

కడప అర్బన్‌: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్‌ జిల్లా కడప సెంట్రల్‌ జైలులో ఓ బ్యారక్‌లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మండ్ల సునీల్‌కుమార్‌ అలియాస్‌ సునీల్‌ శుక్రవారం రాత్రి  కొక్కేనికి బెడ్‌షీట్‌ అంచుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వైఎస్సార్‌ జిల్లాతోపాటు మరో మూడు జిల్లాల్లో నేరాలకు పాల్పడి 19 కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ను మార్చి 27న కర్నూలు జిల్లాలో ఓ కేసు విషయమై కోర్టులో హాజరుపరచి తిరిగి తీసుకొస్తుండగా ఎస్కార్ట్‌ పోలీసులను బురిడీ కొట్టించి పరారయ్యాడు.

ఈ నెల 4 రాత్రి బెంగళూరులో పట్టుబడ్డాడు. గురువారం వైఎస్సార్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సునీల్‌కుమార్‌ను పోలీసులు హాజరు పరిచారు. శుక్రవారం ఉదయం 10.30కు కడప కేంద్ర కారాగారానికి తరలించి కావేరి బ్యారక్‌లో సింగిల్‌గా ఉంచారు. సాయంత్రం 7.30 గంటల వరకు మాట్లాడిన అతడు తనకిచ్చిన ఉలెన్‌ బెడ్‌షీట్‌ అంచును చింపివేసి ఫ్యాన్‌ కొక్కేనికి ఉరేసుకున్నాడు. జైలు సబ్బంది వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ వైద్యులు సునీల్‌కుమార్‌కు పరీక్షలు నిర్వహించి అప్పటికే మరణించినట్లు రాత్రి 8.26 గంటలకు నిర్ధారించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top