
కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహావిష్కరణ
కలెక్టరేట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు
సాక్షి, కాకినాడ: కలెక్టరేట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు. అదే రీతిలో కలెక్టరేట్ మెయిన్‌గేటు సమీపంలో గతంలో కలెక్టరేట్ శత వార్షికోత్సవాల గుర్తుగా ఆవిష్కరించి పక్కకు తొలగించిన పైలాన్‌ను పునఃప్రతిష్ఠ చేయించి దానిని సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకున్న ప్రాశస్త్యానికి సజీవగుర్తు కలెక్టరేట్ అన్నారు. అలాంటి చరిత్రాత్మక స్థలంలో మహాత్ముడి విగ్రహం నెలకొల్పడం మన బాధ్యతను గుర్తెరగడమేనన్నారు.
ఆ నీటితో ఇబ్బందుల్లేవు
కాకినాడ నగరంలో ఆకుపచ్చ రంగులో వస్తున్న మంచినీటి వల్ల ఎటువంటి అనారోగ్యమూ సంభవించదని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. ఆవిష్కరణల అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆ నీటి నాణ్యతలో లోపం లేదన్నారు. మరి రెండు రోజుల్లో సాధారణ మంచి నీళ్లు వస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఏజేసీ డి.మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి బి.యాదగిరి, జేఏసీ నాయకులు పితాని త్రినాథరావు, బూరిగ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.