గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Jul 11 2017 12:10 PM | Updated on Sep 5 2017 3:47 PM
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు(40) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి తన పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతంగా 2 ఎకరాలు, కౌలుకు రెండెకరాలు సాగుచేస్తున్నాడు. సాగునీరు సరిగా అందక, పంటల దిగుబడి లేక రూ.15 లక్షల వరకు అప్పులు అయ్యాయి.
అప్పులు తీర్చే మార్గం కనిపించక తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సత్తెనపల్లి సీఐ నూర్జాన్ నిజిత్ బేగ్ సంఘటనస్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.
Advertisement
Advertisement