దసరా పం డుగకు కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్లిన ఇద్దరు యువకులను అటవీశాఖ అ దికారులు బుధవారం రాత్రి నిర్బంధించా రు.
అటవీ అధికారుల నిర్బంధంలో యువకులు
Oct 10 2013 2:08 AM | Updated on Sep 1 2017 11:29 PM
జగిత్యాల రూరల్, న్యూస్‌లైన్: దసరా పం డుగకు కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్లిన ఇద్దరు యువకులను అటవీశాఖ అ దికారులు బుధవారం రాత్రి నిర్బంధించా రు. జగిత్యాల మండలం సంగంపల్లికి చెం దిన చెర్ల సంతోష్, ఎదులాపురం సత్తయ్య రాత్రి కట్టెల కోసం అడవికి వెళ్లారు. అక్క డి నుంచి తిరిగి వస్తుండగా బీట్ అధికారి శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ మహేశ్ వారిని అదుపులోకి తీసుకుని అటవీశాఖ కార్యాల యానికి తరలించి ఓ గదిలో నిర్బంధించా రు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అటవీశాఖ కార్యాలయానికి వెళ్లగా జరిమానాగా రూ.30 వేలు చెల్లిస్తేనే యు వకులను వదిలిపెడతామని చెప్పడంతో వారు వెనుదిరిగారు.
Advertisement
Advertisement