breaking news
Sattayya
-
వట్టి మేధావులు కాదు... మట్టి మేధావులు కావాలి!
2024 జూలై 24న కొల్లూరి సత్తయ్య అనే బీహెచ్ఈఎల్ కార్మిక నాయకుడు రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఆత్మకథ ప్రచురిత మైంది. దాన్ని సత్తయ్య సొంత మాటల్లో పసునూరి రవీందర్ రాశాడు. ఈ ఆత్మకథను ప్రచురించే ముందు దానికి ముందు మాట రాయాలని పూర్తి పుస్తకాన్ని రవీందర్ నాకు ఆన్లైన్లో పంపించాడు. దాన్ని పూర్తిగా చదివాక బాల్య దశ నుండి సత్తయ్య జీవితం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అటు వంటి ఒక దళిత కార్మికుని జీవిత కథను నేను ఎప్పుడూ చదవలేదు. ఆ పుస్తకానికి టైటిల్ కూడా మీరే సూచించండి అని సత్తయ్య, రవీందర్ అడిగి నప్పుడు ఈయనను ‘మట్టి మేధావి’ అనొచ్చని సూచించాను. ఆ పుస్తకం ఇప్పుడు ‘మట్టి మేధావి – కొల్లూరి సత్తయ్య – ఆటోబయోగ్రఫీ’ అనే టైటిల్‌తో బయటికి వచ్చింది.ముందుమాటలో నేను, ఇలా రాశాను: ‘‘కొల్లూరి సత్తయ్య జీవితకథ... ఒక మట్టి మేధావి చరిత్రలా కనిపిస్తుంది. ఆయన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో (హైదరాబాద్ శివారు తెల్లాపూర్‌లో) ఒక మాదిగ కుటుంబంలో పుట్టి ఈ విధంగా ఎట్లా ఎదిగాడు అనిపిస్తుంది.’’సత్తయ్య మొదట్లో అసలు చదువురాని పది రూపాయల కూలీ మనిషి. బీహెచ్ఈఎల్లో పాకీ దొడ్లు కడుగుడు, క్యాంటీన్ ప్లేట్లు కడుగుడు పని చేసేవాడు. ఇంట్ల రైల్ వే గాంగ్మన్ తండ్రికి ఇద్దరు భార్యలు, 14 మంది పిల్లలు. సత్తయ్య అందరికంటే చిన్నవాడు. తండ్రి తప్ప మిగతా కుటుంబీకులు కూలీపని చేసేవారే. సత్తయ్య తల్లి మాత్రం మంత్ర సాని. ఆమె కులం మాదిగైనా డెలివరీలు చాలా బాగా చేసేది గనుక ఊళ్ళో పుట్టిన ప్రతి పిల్లకు క్షేమంగా కాన్పు చేయించే మంత్రసాని ఆమె.అందువల్ల ఆమెకు ఊళ్ళో బువ్వ దొరకని రోజుండేది కాదట. ఎక్కువ దొరికిన రోజు ఇంట్లో అందరి తోపాటు చుట్టు ఉన్న బిచ్చగాళ్లకు ఆమె బువ్వ పెట్టేది. అవ్వ (తల్లి) నుండి నేర్చుకున్న కొడుకు 10 రూపాయల్లో ఒక్క రూపాయి పక్కకు పెట్టి తమ గ్రామ శివార్లలో ఒంటికి చినిగిన బట్ట పేగులతో బతికే స్త్రీలకు చీర కొనిచ్చే పని మొదలుపెట్టాడు. క్రమంగా బీహెచ్ఈఎల్లో కార్మిక నాయకుడ య్యాడు. తనతో పాటు అతి చిన్న ఉద్యోగులను పర్మనెంటు చెయ్యాలని పోరాటాలు మొదలుపెట్టి కార్మికుల హక్కు కోసం అలుపెరుగని పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో తెలుగులో చదవడం నేర్చు కున్నాడు.గ్రామ స్థాయిలో దళితుల భూములను (ముఖ్యంగా ఇనామ్ భూములు) భూదందా దారులు ఆక్రమించకుండా కాపాడే పోరాటాలు చేశాడు. క్రమంగా ఆర్థికంగా పుంజుకుంటూ కంప్యూటర్ సమస్య బీద విద్యార్థులు ఎదుర్కోగానే చిన్న కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి బీద విద్యా ర్థులకు నేర్పించే ఏర్పాటు చేశాడు. కరోనా రాక ముందే అనాథ పిల్లలను తెచ్చి తన తాతకు ఇనాముగా వచ్చిన భూమిలో గదులు కట్టి తన పిల్లలు చదువుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల్లో చేర్పించాడు. కరోనాతో ఆ సేవ ఆపాల్సి వచ్చింది. అప్పుడు ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు బువ్వ బండి ప్రారంభించాడు. తన సొంత ఆదాయం నుండి ఖర్చుపెట్టి రోజుకు 400 మందికి మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్ రోజూ పెట్టేవాడు. ఆ బువ్వ బండి ఇప్పటికీ నడుస్తోంది. ఆ క్రమంలోనే నా సలహాతో ‘ఫూలే–అంబేడ్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ ప్రారంభించాడు. దీన్ని చట్టపరంగా నడిపేందుకు ‘అమృత–సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపించాడు. 2022 జనవరి 26న ప్రారంభమైన ఈ ఫిలాసఫీ–ఇంగ్లిష్ ట్రైనింగ్ దాదాపు 500 మందిని 23 రాష్ట్రాల నుండి సెలెక్ట్ చేసి ప్రతి 40 మందితో బ్యాచ్‌కి నెలరోజులు ఉచిత వసతి, ఉచిత తిండితో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సత్తయ్యే 2024 జనవరి 30న తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాడు. దానికి ప్రభుత్వం 10 కుంటల భూమి ఇచ్చింది.సత్తయ్యను మట్టిమేధావి (ఇంగ్లిష్‌లో ఇటువంటి వారినే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అని ఎందుకన్నారని నన్ను కొంతమంది అడిగారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ దళితుల, ఆది వాసుల, శూద్ర, బీసీలలో బీద పిల్లల చదువుల గురించి చాలా కృషి చేస్తున్నాడు. మట్టి అన్ని ఉత్ప త్తులకు మూలం. ఉత్పత్తులకు మతం మూలం లేదు. మట్టికి–గింజకు, మట్టికి–జంతు వుకు ఉన్న సంబంధాన్ని మట్టిలో పనిచేసే మనుషులే మేధా వులై కనిపెట్టారు. ఇక్కడే మొట్టమొదట మానవ తత్వశాస్త్రం పుట్టింది. స్త్రీ కడుపులో పుట్టిన మను షులు తిరిగి మట్టి బొందలోకి పోయేవరకు మట్టిని ప్రేమిస్తారు. మట్టితో పోరాడుతారు. అన్ని ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలను మట్టిలో పని చేసే మనుషులు... పుస్తకాలు, మతాలు లేక ముందే ఏర్పర్చుకున్నారు. మట్టి మేధావులు... పుస్తకాలు, మతాలు సమాజంలోకి రాకముందే సమాజాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే భారత దేశంలో మతాలు, వేదాలు వచ్చాక శూద్రుల్లో, దళితుల్లో, ఆదివాసుల్లో ఇటువంటి మట్టి మేధా వులు ఉన్నారు. కాబట్టి వారిని చదువుకు, రాతకు, మతాలను నడపడానికి దూరంగా ఉంచారు. కాల్ప నిక, ఊహాజనిత అంశాలపై పుస్తకాలు రాసేవారు మేధావులనీ; రైతులు, కార్మికులు సత్తయ్యలా మానవత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ వచ్చిన వారిని అసలు గుర్తించని సాహిత్యం తయారు చేశారు. ఇటువంటి ఉత్పత్తి సంబంధ రహిత రచయితలను ‘వట్టి మేధావులు’ అనాలి.ఈ దేశంలో కాళిదాసు నుండి కాళోజీ వరకు ఊహాజనిత కవిత్వాన్ని కావ్యాల రూపంలో రాసినవాళ్లే. కాళిదాసు ‘మేఘ సందేశం’లో భూమి మీదికి తొయ్యబడ్డ యక్షుడు మేఘం ద్వారా కైలాసంలో ఉన్న భార్యకు పంపిన ప్రేమ సందేశంలో ఈ దేశ వర్ణన అంతా ఊహాజనితమైందే. ఇక్కడి వ్యవసాయ భూములు, వాటిలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ఒక పద్యం కూడా అందులో లేదు. మహాకాళి ఆలయ వర్ణన ఉంది గానీ, మహా ఉత్పత్తి రంగమైన పంటపైగానీ, శ్రమచేసి పండించే రైతు బతుకుపై కానీ ఒక పద్యం కూడా లేదు.ఆనాటి సంస్కృత సాహిత్య ఉత్పత్తి వ్యతిరేక వారసత్వం ప్రాంతీయ భాషల్లోకి కూడా పాకి శ్రమను గౌరవించని, లేదా శ్రమను పట్టించుకోని రచయితలు పుట్టుకొచ్చారు. అందుకే ఈ సాహి త్యానికి ప్రపంచ గుర్తింపు లభించలేదు. ప్రకృతి వర్ణన స్త్రీ పురుషుల ప్రేమ కోసమో, యుద్ధ నిర్మా ణాల అవసరాల కోసమో కాదు చెయ్యాల్సింది. ప్రకృతిని ప్రజల శ్రమ జీవనంతో ముడేసిన రచనలు దేశంలో వచ్చినప్పుడు సాహిత్యం సార్వ జనీనత్వం సంతరించుకుంటుంది.గద్దర్ పాటల సాహిత్యంలో పుట్టుకొచ్చిన మట్టి చేతులకు గౌరవం గానీ, సత్తయ్య మాన వత్వపు మట్టిమేధావితత్వం గానీ సమాజాన్ని రోజువారీగా అభివృద్ధి వైపు పయనింపజేస్తుంది. మట్టి మేధావులకు వట్టి మేధావులకు ఉండే తేడా... భూమిపైన మానవ సమానత్వ స్వర్గాన్ని సృష్టించడానికీ, మనుషులు చనిపోయాక స్వర్గం చూపెట్టే తత్వానికీ ఉండే తేడా! మొదటి ఆలోచనలో దేవుడు శ్రమ గౌరవ వాది. రెండవ ఆలోచనలో దేవుడు శ్రమ వ్యతిరేకవాది. ఉత్పత్తి కులాలను ప్రేమించ లేని కుల సమీకరణలు సాహిత్య రంగాన్ని యుద్ధ మయం, ప్రేమమయం చేశాయి. అందుకే సత్తయ్య లాంటి వారి ఆత్మకథలను పిల్లలు చదివినప్పుడు ఉత్పత్తి, శ్రమ, సర్వజంతు ఆదరణవాదులౌతారు. జంతువుల్లో ఒక దాన్ని ఎన్నుకొని పూజించడం జంతుజాతిని కాపాడదు. అన్ని జంతువులనూ ప్రేమించి మేపాలి.భూములు పంచిన భూస్వాములున్నారు. ఆస్తులొదిలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అగ్ర కులస్థులున్నారు. కానీ వాళ్ళు మానవ సమా నత్వాన్ని కోరుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా విద్యా సమానత్వం రూపొందించాలనే ఆలోచనకు వాళ్ళ కులం అడ్డొచ్చింది. సత్తయ్య మాత్రం తాను బడిలో, కాలేజీలో, యూనివర్సి టీలో చదువుకోక పోయినా అంబేడ్కర్ లాగా, మహాత్మా ఫూలే లాగా ఈ దేశ బీద పిల్లలు ఇంగ్లి ష్లో చదువుకొని వాళ్ళ సిద్ధాంతాలను నేర్చుకొని దేశ మార్పునకు కృషి చెయ్యాలని పనిచేస్తున్నాడు.అందుకే సత్తయ్యను మట్టి మేధావి అనాలి. వట్టి మేధావులు కూడా ఆయన జీవిత చరిత్ర చదివి నేర్చుకుంటే దేశానికి మేలు చెయ్యగలరు.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత,సామాజిక కార్యకర్త -
సర్కారీ సన్మానం నాకొద్దు
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని తిరస్కరించిన సత్తయ్య గజ్వేల్: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సర్కారీ సన్మానం తనకొద్దంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఓ ఉపాధ్యాయుడు గురుపూజోత్సవ పురస్కారాన్ని తిరస్కరించాడు. విద్యారంగం తీరును వివరిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడుగురు ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకున్నారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని క్యాసారం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అక్కారం సత్తయ్య మాత్రం పురస్కారాన్ని తిరస్కరించారు. సత్తయ్య తన నిర్ణయాన్ని వేదికపై ప్రకటించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
అటవీ అధికారుల నిర్బంధంలో యువకులు
జగిత్యాల రూరల్, న్యూస్‌లైన్: దసరా పం డుగకు కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్లిన ఇద్దరు యువకులను అటవీశాఖ అ దికారులు బుధవారం రాత్రి నిర్బంధించా రు. జగిత్యాల మండలం సంగంపల్లికి చెం దిన చెర్ల సంతోష్, ఎదులాపురం సత్తయ్య రాత్రి కట్టెల కోసం అడవికి వెళ్లారు. అక్క డి నుంచి తిరిగి వస్తుండగా బీట్ అధికారి శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ మహేశ్ వారిని అదుపులోకి తీసుకుని అటవీశాఖ కార్యాల యానికి తరలించి ఓ గదిలో నిర్బంధించా రు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అటవీశాఖ కార్యాలయానికి వెళ్లగా జరిమానాగా రూ.30 వేలు చెల్లిస్తేనే యు వకులను వదిలిపెడతామని చెప్పడంతో వారు వెనుదిరిగారు.