సర్కారీ సన్మానం నాకొద్దు | I don't wont that award | Sakshi
Sakshi News home page

సర్కారీ సన్మానం నాకొద్దు

Sep 6 2017 2:58 AM | Updated on Sep 17 2017 6:26 PM

సర్కారీ సన్మానం నాకొద్దు

సర్కారీ సన్మానం నాకొద్దు

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సర్కారీ సన్మానం తనకొద్దంటూ సిద్దిపేట జిల్లా

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని తిరస్కరించిన సత్తయ్య
గజ్వేల్‌: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సర్కారీ సన్మానం తనకొద్దంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఓ ఉపాధ్యాయుడు గురుపూజోత్సవ పురస్కారాన్ని తిరస్కరించాడు. విద్యారంగం తీరును వివరిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడుగురు ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకున్నారు. గజ్వేల్‌ నగర పంచాయతీ పరిధిలోని క్యాసారం ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అక్కారం సత్తయ్య మాత్రం పురస్కారాన్ని తిరస్కరించారు. సత్తయ్య తన నిర్ణయాన్ని వేదికపై ప్రకటించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement