విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం వరదనీరు పోట్టెత్తింది.
విజయవాడ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం వరదనీరు పోట్టెత్తింది. దీంతో బ్యారేజ్లోని 30 గేట్లను ఉన్నతాధికారులు ఎత్తివేశారు. దీని ద్వారా 21 వేల క్యూసెక్ల నీరు కిందకి వదిలారు. నదిలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 12 క్యూసెక్లుగా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.