
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటేశ్‌ను విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా వీర బ్రహ్మయ్యను, ఏపీ క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్‌గా ఎంవీ శేషగిరి బాబును, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా కృతిక భాత్రను, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా విధులు నిర్వహిస్తున్న పట్టన్ శెట్టి రవి సుభాష్‌ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఐదుగురికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది.