కర్నూలు జిల్లా చిత్తగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఇప్పటికే ఐదుగురు గ్రామస్థులు మృతి చెందారు.
కర్నూలు : కర్నూలు జిల్లా చిత్తగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఇప్పటికే ఐదుగురు గ్రామస్థులు మృతి చెందారు. మరో వందమంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామంలో విషజ్వరాల ప్రబలడంపై గ్రామస్థులు... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో గ్రామస్థులు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.