పండగ ముందు విషాదం | fisher man died in raod accident | Sakshi
Sakshi News home page

పండగ ముందు విషాదం

Jan 13 2014 3:36 AM | Updated on Aug 30 2018 3:56 PM

పండగ జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. చేపల సొమ్ము తీసుకొస్తానంటూ బావమరిది తో కలిసి బైక్‌పై బయలుదేరిన మత్స్య కారుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు.

కోరుకొండ, న్యూస్‌లైన్  : పండగ జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. చేపల సొమ్ము తీసుకొస్తానంటూ బావమరిది తో కలిసి బైక్‌పై బయలుదేరిన మత్స్య కారుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. కోరుకొండ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఆది వారం ఉదయం మోటార్ బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో కోరుకొండ పంచాయతీ వార్డు సభ్యుడు, మత్స్యకారుడు దొమాడ రమణ (36) అక్కడికక్కడే మరణించాడు. మరో మత్స్యకారుడు. అతడి బావమరిది మల్లి రాంబాబు తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోరుకొండలోని వడ్డీలపేటకు చెందిన మత్స్యకారులు రమణ, మల్లి రాంబాబు బావ, బావమరుదులు. ఆదివారం ఉదయం కోరుకొండ నుంచి మోటార్ బైక్‌పై వీరు గోకవరం వైపు వెళుతున్నారు. గోకవరం నుంచి కోరుకొండ వైపు వస్తున్న కారు  వీరి బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ రమణ అక్కడికక్కడే చనిపోగా, రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 వడ్డీలపేటలో విషాదం
 మత్స్యకారులైన రమణ మరణించడం, రాంబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు కావడంతో కోరుకొండలోని వడ్డీలపేట శోకసంద్రంగా మారింది. స్నా నం చేయడానికి వేడి నీళ్లు పెట్టాలని, వెంటనే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన రమణ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ అతడి భార్య పార్వతి విలపిం చింది. పిల్లలను అల్లారుముద్దుగా చూ సుకునేవాడని, ఇప్పుడు ఏవరు చూస్తారంటూ ఆమె రోదిం చింది. చేపల డబ్బు కోసం గోకవరం వెళ్తున్నానంటూ బయలుదేరిన కొడుకు విగత జీవుడయ్యాడంటూ రమణ తల్లి నాగమణి విలపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement