తిరుమల శేషాచలం అడవిలో శనివారం మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
తిరుమల: తిరుమల శేషాచలం అడవిలో శనివారం మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలోని జింకల పార్కు వద్ద 41వ మలుపు కుడివైపు అడవిప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ అటవీశాఖ అధికారి శివరామ్‌ప్రసాద్, విజిలెన్స్, అగ్నిమాపక విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
సుమారు రెండెకరాల అడవి కాలిపోయింది. 33 కేవీ విద్యుత్ లైను నుంచి వచ్చిన నిప్పు రవ్వల వల్లే మంటలు వ్యాపించాయని జేఈవో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించామన్నారు.