ఇటుకల వ్యాపారం చేసుకుని జీవించే ఇద్దరు ఓ సినిమా ప్రేరణతో దొంగతనాలకు పాల్పడి జల్సాలు చేసుకోవాలని భావించారు.
సినిమా ప్రేరణతో గొలుసు చోరీలు
Aug 11 2013 4:24 AM | Updated on Aug 13 2018 4:19 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : ఇటుకల వ్యాపారం చేసుకుని జీవించే ఇద్దరు ఓ సినిమా ప్రేరణతో దొంగతనాలకు పాల్పడి జల్సాలు చేసుకోవాలని భావించారు. ఐడియా వచ్చిందే తడవు అమలులో పెట్టారు. మహిళల మెడలో గొలుసులు దొంగిలిం చడం (చైన్ స్నాచింగ్) మొదలెట్టారు. ఇలా సుమారు రూ.17 లక్షల విలువైన 88 కాసుల బంగారు గొలుసులు దొంగి లించిన ఈ ఇద్దరు యువకులూ చివరకు జిల్లా పోలీసులకు చిక్కారు. వివరాలను ఎస్పీ ఎం.రమేష్ శనివారం విలేకరులకు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సంతోషనగర్ వాసులు, వరుసకు అన్నదమ్ములైన బైరిశెట్టి శ్రీనివాసరావు(26), బైరిశెట్టి వీరబాబు( 19) ఇటుకలు విక్రయించేవారు.
ఏడాదిన్నర క్రితం రొమాంటిక్ క్రైం స్టోరీ సినిమా చూసి అందులోని చైన్ స్నాచింగ్ సన్నివేశాలకు ప్రభావితులయ్యారు. అలా దొంగతనాలు చేసి జల్సాలు చేయాలని నిర్ణయించుకుని ఇటుకల వ్యాపారం వదిలేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసుతో చైన్ స్నాచింగ్ మొదలుపెట్టారు. ఇద్దరూ బైక్ పై వచ్చేవారు. వెనుక కూర్చున్న వాడు మహిళ మెడలో గొలుసు తెంపేసేవాడు. ఇంకొకడు వేగంగా బైక్ నడిపేవాడు. ఇలా వారు తూర్పు గోదావరిలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 11 చోరీలకు పాల్పడ్డారు.
దొంగ సొత్తును తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. పెరవలి మండలం ఖండవల్లి వద్ద శుక్రవారం సాయంత్రం రావులపాలెం, తణు కు సీఐలు వీరిద్దరినీ చాకచక్యంగా అరెస్టు చేశారని ఎస్పీ తె లిపారు. వీరిద్దరి ఉన్న బంగారంతోపాటు మూడు ఫైనాన్‌స కంపెనీల్లో తాకట్టుపెట్టిన మొత్తం 88 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, కొవ్వూరు డీఎస్పీ బి.రాజగోపాల్, తణుకు సీఐ జి.మధుబాబు, పెరవలి ఎస్సై ఎంవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement