కన్న కూతురు గొంతు కోసిన తండ్రి | Father slits daughter's throat in kurnool district due to love affair | Sakshi
Sakshi News home page

కన్న కూతురు గొంతు కోసిన తండ్రి

Jun 19 2014 5:29 PM | Updated on Aug 16 2018 4:30 PM

తాను ఓ వ్యక్తిని ప్రేమించానంటూ కుమార్తె కన్న తండ్రికి వెల్లడించింది. అంతే కన్న తండ్రి ఆగ్రహాంతో ఊగిపోయాడు.

తాను ఓ వ్యక్తిని ప్రేమించానంటూ కుమార్తె కన్న తండ్రికి వెల్లడించింది. అంతే కన్న తండ్రి ఆగ్రహాంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న కత్తి తీసి కుమార్తె గొంతు కోశాడు. దాంతో ఆ కుమార్తె రక్తపు మడుగులో కుప్పకూలింది. ఆ ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండల గుమ్మనూరులో గురువారం చోటు చేసుకుంది.

 

అయితే కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement