రైతులను పట్టించుకోని ప్రభుత్వం | Farmers to ignore government | Sakshi
Sakshi News home page

రైతులను పట్టించుకోని ప్రభుత్వం

Oct 1 2013 12:50 AM | Updated on Oct 1 2018 2:00 PM

రైతుల సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విమర్శించారు.

నిర్మల్, న్యూస్‌లైన్ : రైతుల సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన ధర్నాలో భాగంగా పార్టీ నిర్మల్ నియోజకవర్గశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట లు నీట మునిగి రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సర్వేలు చేయక, పరిహారం రాక, ఆర్థిక ఇబ్బందులతో కలత చెంది ఎందరో రైతులు ఆ త్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 అరుునా ప్రభుత్వం రైతు కుటుంబాలను ఆదుకోవడంలేదని విమర్శించారు. మరోవైపు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. చేతి కొచ్చే కొద్దిపాటి పంటకైనా మద్దతు ధర కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిం చారు. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7 వేలు, సోయాకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, వారి పిల్లలకు ఉన్నత చదువులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ రావుల రాంనాథ్,  నాయకులు ఆడెపు సుధాకర్, పాకాల రాంచందర్, ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మ రాజు, పంతికె ప్రకాశ్, అయ్యన్నగారి రాజేందర్, రచ్చ మల్లేశ్, అయిండ్ల రమేశ్, రాజేశ్వర్‌రెడ్డి, నరేందర్, పంతికె నారాయణ, హరీశ్, సుధాకర్, మనోహర్, ఎస్‌పీ.రవి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement