'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'

Fake Twitter Account Created In The Name Of BJP Vice President Vishnuvardhan Reddy - Sakshi

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి

ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. అసభ్యకర పోస్టులు చేస్తూ.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించాలని ఈ మేరకు ఫిర్యాదు చేశానని నెహ్రూ యువ సంఘటన వైస్ ఛైర్మన్, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు 360, ట్విటర్, టేక్ వన్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

కేవలం రాజకీయ కక్షతోనే రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ట్విటర్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతుండడంపై వాపోయారు. ఈ మేరకు తన పేరిట ఫేక్ ట్విటర్ అకౌంట్ నడుపుతున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతర కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండి వైరల్‌ అవుతోన్న కథనాలకు.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి జత చేయడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top