ఎన్‌ఐఏ ఎస్సైనంటూ సెటిల్‌మెంట్లు | fake si arrest | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ ఎస్సైనంటూ సెటిల్‌మెంట్లు

Dec 13 2017 5:14 PM | Updated on Oct 17 2018 5:14 PM

ఎటపాక: ఎస్సైనంటూ కొంతకాలంగా సెటిల్‌మెంట్లు చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర నిఘా సంస్థ అయిన ఎన్‌ఐఏ ఎస్సైనని చెబుతూ బోయిన సురేష్‌ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతాల్లో కొంతకాలంగా సెటిల్‌మెంట్లు చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇతను నకిలీ ఎస్సైగా తేలడంతో ఎటపాక పోలీసులు వలపన్ని బుధవారం అతడిని అరెస్టు చేశారు. కాగా, ఈ నకిలీ ఎస్సైకు సహకరించిన ఎటపాక ఎస్సై నాగరాజును వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement