ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ రూపొందించిన ‘ప్రభుత్వ ఉద్యోగాల విరమణ వయస్సు క్రమబద్ధీకరణ బిల్లు’కు సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ రూపొందించిన ‘ప్రభుత్వ ఉద్యోగాల విరమణ వయస్సు క్రమబద్ధీకరణ బిల్లు’కు సోమవా రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవం గా ఆమోదం తెలిపింది. తెలంగాణకు తాత్కాలి కంగా కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకూ పద వీ విరమణ పెంపు వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగులు 58 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినా తిరిగి ఏపీ ప్రభుత్వంలో చేర్చుకోవడానికి బిల్లు అవకాశం కల్పిస్తుంది. పదవీ విరమణకు, తిరిగి ఏపీ ప్రభుత్వంలో చేరడానికి మధ్య గ్యాప్ ఉన్నా.. సర్వీస్ బ్రేక్ లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
బాబు వ్యాఖ్యతో నిరుద్యోగుల్లో ఆందోళన..
ఇంటికో ఉద్యోగమంటూ ఎన్నికల ప్రచారంలో ఊరూరా ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు శాసనసభ సాక్షిగా మాట మార్చడంపట్ల నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదని సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పడం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సరికాదు: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడాన్ని బీసీ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి.. పదవీ విరమణ వయసును పెంచడం సరికాదని ఆయన విలేకరులతో అన్నారు.