కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 6 శాతం పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నుంచి వేతనాలపై 3.14 శాతం మేరకరవు భత్యం పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 6 శాతం పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నుంచి వేతనాలపై 3.14 శాతం మేరకరవు భత్యం పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.18 కోట్ల నుంచి రూ.21 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నాయి.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించిన రెండు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకుంటారు.