breaking news
Employees DA
-
డీఏ బకాయిల కోసం ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంపై ఏపీ సీపీఎస్ఈఏ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.4 లక్షల వరకు డీఏ బకాయిలు రావాల్సి ఉన్నా.. చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని సంఘాధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఆరోపించారు. సెప్టెంబర్ నెలాఖరులోపు సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2, 3 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ప్రతి రూపాయిని చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ప్రధాన డిమాండ్లు ఇవీ..సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలి⇒ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఏఏఎస్‌ను వెంటనే మంజూరు చేయాలి⇒ నాలుగేళ్లుగా ఆలస్యమైన పీఆర్సీని జాప్యం చేయకుండా ప్రకటించాలి⇒ సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక, సర్వీస్ సమస్యలను పరిష్కరించాలి.⇒ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలి -
ఉద్యోగుల డీఏ మార్గదర్శకాలపై జీవోకు సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల డీఏకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంవో అధికారులను ఆదేశించినట్టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వీఆర్వో ల సమస్యలు విని, వారి సర్వీస్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల మేనిఫెస్టోలో పె ట్టి, చెప్పినట్టుగానే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్న తి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఏపీ వీఆర్వోల సంఘం నేతలు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు జీవో విడుదలకూ సీఎం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలపై ఆందోళన చెందుతున్నారని, పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను సులభతరం చేయాలని సీఎంను కోరగా.. దీనిపై అధికారులతో మాట్లాడతానని చెప్పినట్టు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, ఏపీ వీఆర్వోల సం ఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, సంఘ ప్రతినిధులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, అనిల్ పాల్గొన్నారు. -
ఉద్యోగులకు 3.14 శాతం పెరగనున్న డీఏ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 6 శాతం పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నుంచి వేతనాలపై 3.14 శాతం మేరకరవు భత్యం పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.18 కోట్ల నుంచి రూ.21 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించిన రెండు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకుంటారు.


