'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి' | Employee JAC Leaders furious on Minister Kondru Murali | Sakshi
Sakshi News home page

'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి'

Oct 7 2013 1:31 PM | Updated on Sep 1 2017 11:26 PM

'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి'

'అధిష్టానం తొత్తుగా మంత్రి కొండ్రు మురళి'

కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి కొండ్రు మురళి, ఉద్యోగ సంఘాల నేతల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది.

కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి కొండ్రు మురళి, ఉద్యోగ సంఘాల నేతల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది. మంత్రి కొండ్రు మురళీ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోమవారం మధ్నాహ్నం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న సమ్మెను మంత్రి కొండ్రు మురళి తప్పుపట్టినట్టు సమాచారం. 
 
ప్రభుత్వ స్కూళ్లను మూయించి..ప్రైవేట్ స్కూళ్లను ఎలా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి ప్రశ్నించారు. మీ పిల్లలు చదివే స్కూళ్లను మూయించకుండా.. ప్రభుత్వ స్కూళ్లను ఎలా మూయిస్తున్నారని మంత్రి కొండ్రు నిలదీయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తే..మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉద్యోగ సంఘాల నేతలు ధీటుగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అధిష్టానానికి తొత్తుగా వ్యవహరిస్తున్నావంటూ కొండ్రు మురళీ తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పపట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి కొండ్రు మురళి కార్యాలయానికి సమైక్య ఉద్యమకారులు తాళం వేసినట్టు తెలిసింది.. 
 
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు విజ్క్షప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే తాము ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. బుధవారం మధ్నాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement