
జనవరి 14వ తేదీన రైతు భరోసా అమలు చేయాలని కేబ్‌నెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసా పథకంపై సబ్ కమిటీ ఇవాళ చర్చించింది.
సాక్షి, హైదరాబాద్: జనవరి 14వ తేదీన రైతు భరోసా(Rythu Bharosa) అమలు చేయాలని కేబ్‌నెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసా పథకంపై సబ్ కమిటీ ఇవాళ చర్చించింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరై, రైతు భరోసా విధి విధానాలపై చర్చించారు.
పంట పండించే ప్రతీ రైతుకు భరోసా ఇవ్వాలని.. కమిట్మెంట్ అయిన నగదు కంటే తగ్గించి ఇవ్వకూడదని సబ్ కమిటీ అభిప్రాయపడింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. కాగా, మరోసారి మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 5వ తేదీ నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఎల్లుండి(శనివారం) జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
ఇదీ చదవండి: కారు రేసు కేసులో ట్విస్ట్..