
ఏలూరు టౌన్ : ఏలూరు రేంజ్ డీఐజీగా టి.రవికుమార్ మూర్తిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు గత కొంతకాలంగా ఇన్‌ఛార్జ్ పాలనలో కొనసాగుతుండగా తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ డీఐజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్ –2గా పనిచేస్తూ బదిలీపై ఏలూరు రేంజ్ డీఐజీగా వస్తున్నారు. రవికుమార్ మూర్తి రెండురోజుల్లో ఏలూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.