బరిలో నిలవాలంటే.. నిబంధనలు గెలవాలి

Election Commission Rules For Candidates - Sakshi

సాక్షి, దర్శి (ప్రకాశం): ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగ సందడి మొదలైంది. ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల బలాబలాలు తేల్చుకునేందుకు సమయం ఆసన్నమైనది. నోటిఫికేషన్‌ వెలువడిన క్రమంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే పోటీకి అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుంది.

 నామినేషన్‌ పరిశీనల నాటికి అభ్యర్థి  వయస్సు 25 ఏళ్లు నిండి ఉండాలి.
 తొలిసారి అభ్యర్థులకు పాన్‌కార్డు ఉండాలనే నిబంధన విధించారు.
 రాష్ట్రంలోని ఏ అంసెబ్లీ నియోజకవర్గ  పరధిలో అయినా ఓటరుగా ఉండాలి.
 లోకసభకు పోటీ చేసే అభ్యర్థులు డిపాటిట్‌ కింద రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.12,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
 అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్‌ కింద రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు, తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
► నామినేషన్‌ సమయంలో గుర్తింపు పొందిన పార్టీలకు ఒక వ్యక్తి ప్రతిపాదితుడిగా ఉంటే చాలు. గుర్తింపు పొందని పార్టీలకు(ఇండిపెండెంట్‌) పార్టీలకు పది మంది ప్రతిపాదితులుగా ఉండాలి.
 నామినేషన్‌ వేసే వ్యక్తి నియోజకవర్గేతరుడైతే అతను సొంత నియోజకవర్గానికి చెందిన ఏఈఆర్వో, ఈఆర్వోలతో ఓటరుగా సర్టిఫైడ్‌ ప్రతిని తీసుకొని నామినేషన్‌ పరిశీలన గడువు కన్నా ఒక రోజు ముందే ఇవ్వాల్సి ఉంటుంది.
 నామినేషన్‌తో పాటు రెండు చొప్పున అఫిడవిట్లు దాఖలు చేయాలి. రూ.10 విలువ గల నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్లు తయారు చేసి ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌/నోటరీ ద్వారా ధ్రువీకరించాలి.
 ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.
 లోక సభ అభ్యర్థి ఖర్చు రూ. 70లక్షలు  కంటే  మించకూడదు.
 అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు కంటే మించరాదు.
 మైకులు వాడకానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలి.
 ర్యాలీలు నిర్వహించేటప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు.
 ప్రభుత్వ కార్యాలయాలు, మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో ప్రచారం నిషేధం.
 అభ్యర్థులు నియమించుకునే పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు సంబంధిత పోలింగ్‌ బూత్‌లో ఓటరుగా నమోదు అయి ఉండాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top