8 మంది కామాంధుల అరెస్ట్ | eight accused held over pregnant woman rape attempt | Sakshi
Sakshi News home page

8 మంది కామాంధుల అరెస్ట్

Mar 19 2014 4:21 PM | Updated on Sep 4 2018 5:07 PM

బాధితురాలు - Sakshi

బాధితురాలు

నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రి సమీపంలో గర్భిణిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన 8 మంది కామాంధులను షాహినాయత్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రి సమీపంలో గర్భిణిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన 8 మంది కామాంధులను షాహినాయత్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఆరుగురు నిందితులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట్‌కు చెందిన హరితలక్ష్మి(25) అనే మహిళపై ఆదివారం రాత్రిపై సామూహిక అత్యాచారయత్నం జరిగింది.

కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూసీ నది ఒడ్డుకు వెళ్లిన ఆమెపై లక్ష్మిపై లైంగిక దాడికి యత్నించారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అడ్డుకోబోయిన ఆమె భర్త రామకృష్ణపై కత్తులతో దాడి చేశారు. బాధితుల కేకలు విని అటుగా వెళ్లేవారు రావడంతో దుండగులు పరారయ్యారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement