కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్ | EAMCET counseling Arrestment | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్

Aug 22 2013 12:58 AM | Updated on Sep 1 2017 9:59 PM

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వరుసగా మూడోరోజూ ఆటంకం తప్పలేదు. జేఎన్‌టీయూ కాకినాడలో ఈ నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వరుసగా మూడోరోజూ ఆటంకం తప్పలేదు. జేఎన్‌టీయూ కాకినాడలో ఈ నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత మూడురోజులుగా యూనివర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు బుధవారం  సహనాన్ని కోల్పోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్ నిర్వహణకు అంగీకరించాలంటూ ఆందోళనకు దిగారు. ‘వీసీ డౌన్‌డౌన్..కలెక్టర్ దిగిరావాలి..కౌన్సెలింగ్  జరిపించాలి’ అంటూ జేఎన్‌టీయూకేలోని కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నినాదాలు చే శారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారి ఆందోళన కొనసాగింది.
 
 ఒక దశలో జేఎన్‌టీయూ జేఏసీ సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాదులాట జరిగింది. పోలీసుల జోక్యంతో అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆర్డీఓ జవహర్‌లాల్ నెహ్రూ ఇరువర్గాలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. విద్యార్ధులు జేఎన్‌టీయూ ప్రాంగణంలో పెద్దగా నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. జేఎన్‌టీయూకే జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ నిర్వహించేది లేదని, రెండురోజుల పాటు ఉద్యోగులంతా పెన్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
 ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి నిర్ణయం జేఎన్‌టీయూకే వీసీ చేతుల్లో లేదని, కౌన్సెలింగ్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్నందున ప్రస్తుత పరిస్థితిని వారికి విన్నవించి స్పష్టమైన ప్రకటన చేసేలా చర్యలు చూస్తామని జేఏసీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమం     లో వెయ్యిమందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సర్పవరం ఎస్‌హెచ్‌ఓ వైఆర్‌కే శ్రీని వాస్ పరిస్థితిని సమీక్షించారు. ఇం త భారీస్థాయిలో నిరసన కార్యక్ర మం జరిగినా ఉన్నతాధికారులెవ రూ స్పందించక పోవడంపై  తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు.
 
 బొమ్మూరు పాలిటెక్నిక్‌లోనూ నిలిచిన కౌన్సెలింగ్
 రాజమండ్రి రూరల్ : బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ మూడవరోజు బుధవారం నిలిచిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాలనుంచి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. అయితే కళాశాల లెక్చరర్లు తాము కౌన్సెలింగ్ విధులు నిర్వహించలేమని తేల్చి చెప్పేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ విలియం క్యారీ వద్దకు వచ్చి అడిగినప్పటికీ తాత్కాలిక సిబ్బందితో కౌన్సెలింగ్ చేయిస్తే వచ్చే ఇబ్బందులను వారికి వివరించారు. పాలిటెక్నిక్ కళాశాల రెగ్యులర్ లెక్చర ర్లు విధులు నిర్వహిస్తేనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, తాత్కాలిక అధ్యాపకులతో నిర్వహించి ఏమైనా పొరపాటు జరిగితే తమపై తగు చర్యలు తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ హెచ్చరించారని తెలిపారు. 
 
 రాజమండ్రి ఇన్‌చార్జి ఆర్డీఓ నరసింహమూర్తి వచ్చి లెక్చరర్లతో మాట్లాడినా ప్రయోజనం లే కుండా పోయింది. తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి చూసి చివరకు నిరాశతో వెనుదిరిగారు. కాగా బొ మ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో స మైక్యాంధ్ర ఉద్యమం అయ్యేవరకు కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదని కళాశాల వర్గాలే పేర్కొంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement