లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు | Dvakra loans beyond the target | Sakshi
Sakshi News home page

లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు

Jul 23 2014 3:41 AM | Updated on Sep 29 2018 6:00 PM

లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు - Sakshi

లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు

జిల్లాలో లక్షా ్యన్ని మించి రూ.443 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందజేశామని డీర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు.

మాకవరపాలెం : జిల్లాలో లక్షా ్యన్ని మించి రూ.443 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందజేశామని డీర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. రూ.380 కోట్లు లక్ష ్యంకాగా రూ.443కోట్లు అందజేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 38 వేల డ్వాక్రా సంఘాలకు 1999 నుంచి ఇప్పటి వరకు రూ.1600 కోట్లు రుణాలిచ్చామన్నారు. ప్రస్తుతం వీరంతా రూ. 593కోట్లు బ్యాంకులకు చెల్లించాలన్నారు.
 
వీటిలో మొండి బకాయిలు రూ.16 కోట్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 3.19లక్షల మందికి పింఛన్లుగా ప్రతి నెలా రూ.8కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆధార్ సీడింగ్ 1.08లక్షల మంది పెన్షన్‌దారులకు పూర్తయిందన్నారు. బయోమెట్రిక్‌లో భాగంగా ఇంకా 46వేల మంది నుంచి వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. వేలి ముద్రలు పడని వారుంటే వారి బంధువుల వేలి ముద్రలు ఇవ్వవచ్చన్నారు.
 
నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చనిపోయిన 3450మంది పింఛనుదారుల పేర్లను తొలగించామన్నారు. బోగస్ పింఛన్లను తొలగించేందుకు ఆధార్ సీడింగ్ చేపడుతున్నామన్నారు. కొత్తగా 29,600 మంది పింఛన్ల కోసం దరఖాస్తు  చేసుకున్నారని వివరించా రు. డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలయిన 54వేల మంది విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 1200చొప్పున  ఏటా రూ.5.66కోట్లు అందజేస్తున్నామన్నారు.
 
జనశ్రీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తం గా లక్ష మంది ఎస్సీ,ఎస్టీలను ఈ పథకంలో చేర్చడమే లక్ష ్యమన్నారు. ఒక్కొక్కరు రూ.15 చెల్లించి ఈ బీమా పథకంలో చేరితే సాధారణ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.75వేలు అందుతుందన్నారు. వచ్చేనెల 16నుంచి 23వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యంలో బీమా వారోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ష్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తామన్నారు.  కార్యక్రమంలో ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగం ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
బైక్ ఎక్కిన పీడీ

గొలుగొండ : డ్వాక్రా మహిళలు సమావేశమై పొదుపు, బకాయిలు తీర్చేపద్ధతులపై చర్చించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేటలో మంగళవారం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.  ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలున్నాయి? ఎంత మేర రుణం తీర్చారు? తదితర విషయాలు తెలుసుకున్నారు. విధిగా వారానికి ఒకసారి సమావేశం కావాలన్నారు. మద్యపాన నిషేధంపై కూడా చర్చించుకోవాలన్నారు. ఉపాధి హామీలో కూరగాయల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం మండలంలో మారుమూల డొంకాడ వెళ్లి, అక్కడి ఐకేపీ బాలబడి కేంద్రాన్ని పరిశీలించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు ద్విచక్ర వాహనం, మరో రెండు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులు తాగునీరు, విద్యుత్, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీని కోరారు.  కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, బాలబడుల జిల్లా ఇన్‌చార్జి గోవిందరావు, డివిజన్ ఇన్‌చార్జి కొండలరావు,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement