ఏ ఊరు వాడో?

Dumb And Deaf Pesron missing in Viziangaram - Sakshi

తప్పిపోయి నాతవలసకు చేరిన బధిరుడు

విజయనగరం, డెంకాడ: మండలంలోని నాతవలస గ్రామానికి మంగళవారం ఓ బధిరుడు తప్పిపోయి వచేశాడు. ఊరు, పేరు చెప్పేందుకు ఆ వ్యక్తికి చెవిటి, మూగవాడు. దీనికి తోడు నిక్ష్యరాస్యుడు కావడంతో రాసికూడా చెప్పే అవకాశం లేకుండా పోయింది. తన సైగల ద్వారా ఏదో చెప్పాలని ఆ వ్యక్తి  ప్రయత్నిస్తున్నాడు. తనకు ఇద్దరు పిల్లలు అని మాత్రం సైగలు చేస్తున్నాడు. ఎక్కడికో పనికి తనవారితో గ్రూపుగా వెళుతూ తప్పిపోయి నాతవలసకు చేకున్నాడని ఆయన సైగల ద్వారా అర్థమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ట్రైన్‌లో వెళ్లుతూ నీళ్లు తాగేందుకు కిందకు దిగిలోపే ట్రైన్‌ వెళ్లిపోయినట్లు సైగల ద్వారా చెబుతున్నాడని అంటున్నారు. ఎలాగోలా చివరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న నాతవలస ఎస్టీ కాలనీ వద్దకు చేరుకున్న ఆయన్ను వారంతా చేరదీశారు. మూడు నెలలుగా ఈ వ్యక్తి భోజన సదుపాయాలను ఎస్టీ కాలనీవాసులే కల్పిస్తున్నారు. మనిషి తెలుగు వ్యక్తిలాగే ఉన్నాడు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు 8309034137, 7995620550, 8019714576 నంబర్లకు సమాచారం అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top