తాగొచ్చా..ఐతే ఏంటి?!

Drunkenly Bus Driver Rude Behaviour Passengers Mantralayam  - Sakshi

సాక్షి, మంత్రాలయం(కర్నూలు) :  ‘ఔను..నేను తాగొచ్చా. ఐతే ఏంటి?! నన్నెవ్వరూ ఏమీ చేయలేరం’టూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ చిందులు తొక్కాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మంత్రాలయంలో చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ21జడ్‌ 0772 నంబర్‌ గల బస్సు (సర్వీస్‌ నం 6513) సోమవారం రాత్రి  హైదరాబాద్‌కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. ఎమ్మిగనూరు డిపోలో బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్‌ కృష్ణకు బ్రీత్‌ ఎనలైజింగ్‌ టెస్టు చేసి పంపించారు.

అయితే.. అతను మార్గమధ్యంలో మద్యం సేవించి బస్సును తీసుకుని మంత్రాలయం చేరుకున్నాడు. మంత్రాలయం నుంచి హైదరబాద్‌కు బస్సు బయలుదేరే సమయంలో మద్యం వాసన వస్తుండటంతో ప్రయాణికులు నిలదీశారు. మద్యం సేవించినట్లు అతను ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు డీఎం దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లడంతో అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపారు. కాగా..మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ కృష్ణ ప్రయాణికులతో దురుసుగా మాట్లాడాడు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top